ఎమ్మెల్యే మెగారెడ్డి కృషితో రూ.241 కోట్లతో వనపర్తి ఐటీఐ హబ్ అభివృద్ధికి శ్రీకారం
వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం
ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి
మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా,:
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మంజూరుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ కి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి
నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలోనే విద్యాపర్తిగా పేరెన్నికగన్న వనపర్తి పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలవనుంది వనపర్తి నియోజకవర్గాన్ని విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ ఫలితంగా వనపర్తి మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో చేపట్టిన ప్రతిష్టాత్మక క్లస్టర్–8 అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్ ఏ ఐ పి ప్రాజెక్టుకు రూ.241కోట్ల అంచనా వ్యయంతో టెండర్ ప్రక్రియ ప్రారంభించింది ఈ క్లస్టర్‌కు వనపర్తి ప్రభుత్వ ఐటీఐని హబ్‌గా ఎంపిక చేయడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది వనపర్తి హబ్ ఆధ్వర్యంలో మన్ననూరు, మహబూబ్‌నగర్ బాలికల ఐటీఐ, దిండి, గద్వాల ప్రభుత్వ ఐటీఐలు అనుసంధానమై ఒక సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థగా రూపుదిద్దుకోనున్నాయి దీంతో వనపర్తి రాష్ట్రంలోనే ప్రముఖ నైపుణ్య శిక్షణా కేంద్రంగా అవతరించనుంది ఈ ప్రాజెక్టు ద్వారా వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్‌లు, ఆధునిక యంత్రాలు,డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌లు, క్యాంపస్ నియామకాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు,కల్పించబడనున్నాయి.
ప్రభుత్వంతో కలిసి ఎంపికయ్యే పరిశ్రమ భాగస్వామి ఐదేళ్లపాటు ఈ క్లస్టర్‌ను నిర్వహిస్తూ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు శిక్షణా నాణ్యతను పెంచి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దనున్నారు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ దృష్టిని వనపర్తిపై కేంద్రీకరించేలా చేసిన నిరంతర కృషికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తోంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, స్థానికంగానే ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కలగనుంది గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించి, దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించే అవకాశాలు మరింత విస్తరించనున్నాయి విద్యాపర్తి”గా వనపర్తిని తీర్చిదిద్దే దిశగా ఇది మరో చారిత్రాత్మక అడుగు.రూ.241 కోట్ల ఈ ప్రతిష్టాత్మక హబ్ ప్రాజెక్టు వనపర్తి విద్యా, నైపుణ్యాభివృద్ధి చరిత్రలో మరో కలికితురాయిగా నిలవనుందని, ఇట్టి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు




