📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా మేకల సురేంద్ర నియామకం

ఏపీ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా మేకల సురేంద్ర నియామకం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా( ఆగస్టు 4 ప్రజావాణి) హ్యూమన్ రైట్స్ క్రోన్ ప్రతినిధి మరియు ప్రముఖ న్యాయవాది మేకల సురేంద్ర ఏపీ బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా లీగల్ సెల్ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని సంఘ ముఖ్య ప్రతినిధులు ఆయనకు అందజేసి, శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.బీసీల హక్కుల పరిరక్షణే ధ్యేయం: మేకల సురేంద్ర,ఈ సందర్భంగా లీగల్ సెల్ నూతన కన్వీనర్ మేకల సురేంద్ర, మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మరియు జిల్లా కమిటీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల హక్కుల పరిరక్షణకు, వారికి సామాజిక న్యాయం అందించడానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన అవకాశాలు మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందేలా చూడటంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.ఉచిత న్యాయ సహాయం అందిస్తాం పేద, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు న్యాయపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే,వారికి లీగల్ సెల్ తరఫున ఉచితంగా న్యాయ సలహాలు, అవసరమైన పూర్తి న్యాయ సహాయాన్ని అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.బీసీల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.సంఘం నిర్వహించే ప్రతి సేవా మరియు పోరాట కార్యక్రమాల్లో యువత, మేధావులు చురుకుగా పాల్గొని సమాజ ప్రగతికి తోడ్పడాలని కోరారు.మేకల సురేంద్ర నియామకం పట్ల కడప జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు,హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు మరియు పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో జిల్లాలోని బీసీ లీగల్ సెల్ మరింత బలోపేతం అవుతుందని,బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ సురేంద్ర,కి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular