📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguరోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

📰 Generate e-Paper Clip

 

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ పెద్ద పీట వేస్తున్నదని, పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలసి మంత్రి నూతన సదరం శిబిరం, యుడిఐడి భవనాన్ని, ఆక్సిజన్ ప్లాంట్, అర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈ ఎన్ టి విభాగాలకు సంబంధించిన నాలుగు ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, రానున్న రోజులలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా ఆసుపత్రి ఇరుకుగా ఉన్న కారణంగా మరో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో కన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందడం ఆశించదగ్గ విషయమని, ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరమర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ ఛైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ ఆసియా షాహిన్,
జిల్లా ఆస్పత్రి వైద్యాధికారి
చంద్ర శేఖర్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular