📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguస్నేహ కుసుమాలు వాడిపోలేదు.

స్నేహ కుసుమాలు వాడిపోలేదు.

📰 Generate e-Paper Clip


.మిత్రుని కుటుంబానికి 46 వేల రూపాయల ఆర్థిక సహాయం.
.ZPHS పస్రా 1995-96 బ్యాచ్ చూపిన మానవత్వం.

పస్రా/ములుగు జిల్లా రిపోర్టర్‌ (ప్రజావాణి)

పదేళ్లు ఒకే బెంచ్ పై కూర్చుని చదువుకున్న స్నేహం… కాలం గడిచినా చెక్కు చెదరలేదు.
ZPHS పస్రా 1995-96 10వ తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు చిన్ననాటి మిత్రుడు జాడి యుగంధర్ అకాల మరణంతో కుంగిపోయిన ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన యుగంధర్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి చర్చించారు.స్నేహితుడి కుటుంబం అంటే మన కుటుంబమే అనే నిర్ణయంతో ఏకమై రూ. 46,000 ఆర్థిక సహాయం అందించారు.
స్నేహితులందరూ కలిసి యుగంధర్ కుటుంబాన్ని కలిసి సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ _”మిత్రమా… నువ్వు లేకపోయినా నీ కుటుంబానికి మేమున్నాం. స్నేహం అంటే కష్టంలో తోడుగా ఉండడమే”_ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
స్నేహకుసుమాలు వాడిపోవని బంధాలు డబ్బుతో కొలవలేమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. 30 ఏళ్ల తర్వాత కూడా ఒకరికొకరు అండగా నిలిచిన 1995-96 బ్యాచ్ స్నేహితుల మానవత్వంఅందరికీ ఆదర్శంగా నిలిచింది.
సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేశారు.

*బై రిపోర్టర్: గొల్లపెల్లి శ్రీకాంత్*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.