📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఉచిత ENT పరీక్షలకు పసర గ్రామస్థుల బారులు. .డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం....

ఉచిత ENT పరీక్షలకు పసర గ్రామస్థుల బారులు. .డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. .అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రామ ప్రజలు.

📰 Generate e-Paper Clip

ఉచిత ENT పరీక్షలకు పసర గ్రామస్థుల బారులు.
.డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం.
.అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రామ ప్రజలు.

గోవిందరావుపేట/ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

పసర గ్రామంలో ఉచిత చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్ వైద్య పరీక్షల శిబిరం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ భూక్య సుమలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హన్మకొండ నుండి విచ్చేసిన డాక్టర్ సి.హెచ్. విజయ్ కుమార్ గ్రామ ప్రజలకు ఉచితంగా ENT సంబంధిత పరీక్షలు నిర్వహించి, వారిలో ఉన్న లోపాలను గుర్తించారు.

అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు హన్మకొండలోని తన ఆసుపత్రికి వచ్చి పూర్తి ట్రీట్మెంట్ చేయించుకోవాలని డాక్టర్ విజయ్ కుమార్ సూచించారు.
పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు
ఇలాంటి ఉచిత వైద్య సేవను సద్వినియోగం చేసుకునేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు.
పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందుకు డాక్టర్ విజయ్ కుమార్ కు గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజన రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.