📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణనిజాంసాగర్లోకి చేరుకుంటున్న వరదనీరు - రైతుల కళ్ళల్లో ఆనందం.

నిజాంసాగర్లోకి చేరుకుంటున్న వరదనీరు – రైతుల కళ్ళల్లో ఆనందం.

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్లోకి చేరుకుంటున్న వరదనీరు – రైతుల కళ్ళల్లో ఆనందం.

ప్రాజెక్టులోకి 6585 క్యూసెక్కుల ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో 141 క్యూసెక్కులు.

బాన్సువాడ/ప్రజావాణి:-నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా,ప్రస్తుత నీటిమట్టం 1395.40 అడుగులుగా నమోదైంది.ప్రస్తుతం ప్రాజెక్టులో 7.139 టి.ఏం.సి నీటినిల్వ ఉంది.గత సంవత్సరం ఇదే రోజు నీటిమట్టం 1391.25 అడుగులు,నిల్వ 4.597 TMC ఉండగా,ఈసారి దాదాపు 4 అడుగులు,2.5 TMC అదనంగా నీరు ఉంది.గడిచిన 24 గంటల సగటు వరద ఇన్ ఫ్లో 6585 క్యూసెక్కులు,అవుట్ ఫ్లో 141 క్యూసెక్కులు.వేరే ఇతర మార్గాల ద్వారా సాగర్ నీటి విడుదల లేదు. ఆవిరయ్యే నీటి ద్వారా మాత్రమే 141 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉంది.ఎగువ ప్రాంతాల నుండి వరద కొనసాగుతుండడంతో అధికారులు ప్రాజెక్ట్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.దీంతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి నీరు చేయడంతో రైతుల కళ్ళల్లో ఆనంద వెళ్లివిరుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular