📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMahabubabadమునిగలవీడులో పూరి గుడిసెలు పరిశీలన

మునిగలవీడులో పూరి గుడిసెలు పరిశీలన

📰 Generate e-Paper Clip

..
ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడులో గతంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఇండ్ల కోసం అందజేసిన దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీవో సింగారపు కుమార్ గ్రామంలోని పూరిగుడిసెలు,రేకుల ఇండ్లను మంగళవారం సందర్శించి పరిశీలించారు.గ్రామ సర్పంచి బొల్లి కొండ చైతన్య నాగరాజు సూచన మేరకు ఇంకా మిగిలి ఉన్న పూరి గుడిసెలను సైతం ఎంపీడీవో విజిట్ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పక్కా ఇండ్లు లేని నిరుపేదల ఇండ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు,స్పెషలాఫీసర్ సోమ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి.వెంకన్న, కాంగ్రెస్ నాయకులు తుప్పతూరి రాజు యాదవ్, బైసర్ రాజేష్ ఇసంపెల్లి రమేష్ కరోబార్ ఉప్పలయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular