📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్‌కేసర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 27: ఘట్‌కేసర్ విద్యుత్ విభాగం పరిధిలో చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో జూలై 28 (మంగళవారం) పలుచోట్ల విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.

ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బాలాజీనగర్ ఫీడర్, కొండాపూర్ వ్యవసాయ ఫీడర్ పరిధిలోని గాంధీనగర్, గీతామందిరం వెనుక ప్రాంతం, జగదాంబ థియేటర్ పరిసరాలు, మూడు గుడులు–బాలాజీనగర్, సాయిబాబా ఆలయం పరిసరాలు, వివేకానంద ఈడబ్ల్యూఎస్ కాలనీ, గురుకుల పాఠశాల వెనుక ప్రాంతం, బాలాజీనగర్, కొండాపూర్ వ్యవసాయ ప్రాంతం, మజర్‌గూడ వ్యవసాయ ప్రాంతం, మజర్‌గూడ లాంగ్ ప్రాంతాల్లో…

మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు కొండాపూర్ గ్రామ ఫీడర్ పరిధిలోని కొండాపూర్ గ్రామపంచాయతీ కాలనీ, హనుమాన్ ఆలయం పరిసరాలు, ఎస్సీ బస్తీ, వెంకటేశ్వరస్వామి ఆలయం పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

విద్యుత్ వినియోగదారులు అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని టీజీఎస్పీడీసీఎల్ ఘట్‌కేసర్ సెక్షన్ అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular