📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialఫలించిన ఎస్సిఈయు (సిఐటియు) కృషి

ఫలించిన ఎస్సిఈయు (సిఐటియు) కృషి

📰 Generate e-Paper Clip

*ఫలించిన ఎస్సిఈయు (సిఐటియు) కృషి*

*కోర్ట్ తీర్పు ప్రకారం బేసిక్ లో నష్టాన్ని సరిచేయాలి*

*ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంద నర్సింహారావు, తుమ్మల రాజారెడ్డి*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 26

సింగరేణిలో అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కొచ్చిన కార్మికులకు జరిగిన నష్టాన్ని సవరించడానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) చేసిన కృషి ఫలించిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఏరియాలో బేసిక్ లో నష్టపోయిన వివిధ గనుల నుండి హాజరైన కార్మికులతి నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా నర్సింహారావు, రాజారెడ్డి లు మాట్లాడుతూ, 2020 లో కిష్టారం ఓసిపిలో,  2021లో భూపాలపల్లి ఏరియాలలో దాదాపు 23 మంది కార్మికులకు హైకోర్టులో కేసు వేయడం వల్ల ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పులో వారికి జరిగిన బేసిక్ లో నష్టాన్ని సవరించడం తోపాటు గ్రేడ్, బేసిక్ లో నష్టాన్ని సైతం సరిచేయాలని, దానికి సంబంధించిన ఏరియర్స్ మూడు నెలల్లో సెటిల్ చేయాలని కోర్టు తీర్పులో వెల్లడించిందని తెలిపారు. ఈ తీర్పును యాజమాన్యం వెంటనే అమలు చేసి, కార్మికులకు జరిగిన నష్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2017 తర్వాత ఎవరైతే అండర్ గ్రౌండ్ నుంచే సర్ఫేస్ కు వచ్చిన కార్మికులందరికీ సైతం ఈ కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. దీనికి సంబంధించి కార్మికులు యూనియన్ అన్ని బ్రాంచ్ ల నాయకులను కలిసి వారి బేసిక్ లు, గ్రేడ్ లలో జరిగిన నష్టాన్ని సరి చేసుకోవటం కోసం ప్రయత్నించాలని సూచించారు. సింగరేణి సంస్థ తన అవసరాల రీత్యా ఐఈడి లెక్కల ప్రకారం అండర్ గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్ పెట్టుకోమని ఆహ్వానించి, వారి బేసిక్ లకు నష్టం చేయకూడదని, కంపెనీ తన ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఇలా కార్మికులకు నష్టం చేయటం యజమాన్యానికి తగదని సూచించారు. అదేవిధంగా ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కు అనేకమంది అధికారులు పనిచేస్తున్న వారికి బేసిక్ లో గాని గ్రేడ్ లో గాని అలాంటి నష్టం చేయకుండా చూస్తున్నారని, అదేవిధంగా కోల్ ఇండియాలో సైతం సర్ఫేస్ కు వచ్చిన కార్మికులకు ఎవ్వరికీ సైతం బేసిక్ గాని, గ్రేడ్ గాని తగ్గించకుండా చేస్తున్న నేపథ్యంలో సింగరేణిలోనే ఇటువంటి నష్టాన్ని కలిగించడాన్ని యూనియన్ సిఐటియు తీవ్రంగా ఆక్షేపిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇటువంటి పనులకు పూనుకోవద్దని సింగరేణి యాజమాన్యానికి హితువు పలికారు. యాజమాన్యం సోమవారం గోదావరిఖనిలో నిర్వహిస్తున్న సేఫ్టీ సమావేశాలకు అన్ని యూనియన్లను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, బ్రాంచ్ నాయకులు జడల ప్రవీణ్, లింగాల సత్యనారాయణ, బుద్దే సురేష్, బాసబోయిన కుమారస్వామి, చైతన్య రెడ్డి, రేగుల శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ కలవల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular