📄 ePaper
Sunday, July 26, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialవృద్ధురాలు అదృశ్యం: పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

వృద్ధురాలు అదృశ్యం: పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కోస్నపల్లి (రంగదామునిపల్లె) గ్రామానికి చెందిన తమ్మల్ల లచ్చవ్వ (75) అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు తమ్మల్ల మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమురయ్య సతీమణి అయిన లచ్చవ్వ కనిపంచకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌.ఐ. ఏం కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular