📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఆర్ జి కె లోని 358వ బూత్‌లో ఇంటింటి సర్వే నిర్వహణ

ఆర్ జి కె లోని 358వ బూత్‌లో ఇంటింటి సర్వే నిర్వహణ

📰 Generate e-Paper Clip

పోచారం, జూలై 23: పోచారం పరిధిలోని 358వ బూత్ (ఆర్‌జీకే)లో ఓటరు జాబితా ప్రత్యేక ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ వంగల లక్ష్మి, బీఎల్‌ఏ వినోద్ కలిసి 50 నుంచి 62 వరకు ఉన్న భవనాల్లో ఇంటింటి సర్వే చేపట్టి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

సర్వే సందర్భంగా ఓటర్ల వివరాలను ధృవీకరించడంతో పాటు అవసరమైన మార్పులు, చేర్పులను నమోదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు చేపడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అలాగే, ప్రతి కుటుంబం ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి బీఎల్‌ఓకు అందించాలని, తద్వారా ఓటరు జాబితా ఖచ్చితత్వం మెరుగుపడుతుందని బీఎల్‌ఓ వంగల లక్ష్మి, బీఎల్‌ఏ వినోద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular