📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriరాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఘట్‌కేసర్‌లో కాంగ్రెస్ శాంతి ర్యాలీ

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఘట్‌కేసర్‌లో కాంగ్రెస్ శాంతి ర్యాలీ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 23: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఆధ్వర్యంలో గురువారం శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అరెస్టులు, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ ర్యాలీలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి మామిడ్ల ముత్యాలు యాదవ్, పోచారం, ఎదులాబాద్ డివిజన్ కర్రే రాజేష్, సామల అమర్, మాజీ ఛైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.