📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి: వేముల మహేష్ గౌడ్

ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి: వేముల మహేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 22: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం డివిజన్ అధ్యక్షుడు సామల అమరేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుంటూ డివిజన్ పరిధిలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా నమోదు చేయించేందుకు కృషి చేయాలని సూచించారు. రాబోయే డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త, పాత నాయకులు మరియు కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, తాను కూడా ఎదులాబాద్ డివిజన్ పరిధిలోనే అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తకు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాథం, మాజీ ఎంపీటీసీ కందుల కుమార్, మాజీ సర్పంచ్ నానావత్ రూప్‌సింగ్ నాయక్, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కవాడి మాధవ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌లు అకిటి సుధాకర్ రెడ్డి, వేముల సత్తయ్య గౌడ్, మాజీ బ్యాంకు డైరెక్టర్ ఉదయ్‌కుమార్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఇక్బాల్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగి శంకర్, వేముల రాజు గౌడ్, సల్మాన్, మడ్డి అశోక్ గౌడ్, నల్లోల మధు, కంచర్ల వెంకట్ రెడ్డి, మెట్టు రమేష్, బాల వెంకటేష్, బింగి సురేష్ గౌడ్, వేముల శంకర్ గౌడ్, మెట్టు నర్సింహా, గుర్జకుంట నర్సింహా, పూర్రు బస్వయ్య, జంగయ్య యాదవ్, పూల రాజు, జంగయ్య ముదిరాజ్, నానావత్ సురేష్ నాయక్, కృష్ణ, పూస రమేష్, కంట్లం ఓం, సందీప్ రెడ్డి, ముద్దం మల్లేష్ యాదవ్, బత్తిని శ్రీనివాస్, కూరం గిరి, నానావత్ శివాజీ నాయక్, తోటకూర శ్రీనివాస్ యాదవ్, చిన్న యాదవ్ బాలకృష్ణ, సురేష్ యాదవ్‌తో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.