📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

*విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి*
*రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్*
షాద్ నగర్ ప్రజా వాణి జులై 22:
నీట్–యూజీ పరీక్షల అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్–యూజీ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం, విద్యార్థులను అణచివేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు నిరసనగా షాద్‌నగర్ పట్టణ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. విద్యార్థులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు, లాఠీచార్జ్‌లు చేసినా విద్యార్థి ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
భగత్‌సింగ్ వారసులుగా విద్యార్థుల హక్కుల కోసం ప్రాణాలు పోయినా పోరాడుతామని ఆయన అన్నారు. నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.