📄 ePaper
Wednesday, July 15, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

📰 Generate e-Paper Clip

ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు.

రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గ పాల్గొనాలి.

బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ప్రభుత్వ పథకాలకు,  కాంగ్రెస్‌ ప్రజాపాలనకు ఆకర్షితులై మాజీ ప్రజాప్రతినిధులు,ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర బీసీసంక్షేమ,రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండలం జగన్నాధపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ వార్డ్ సభ్యులు బండి కుమారస్వామిలు కాంగ్రెస్‌ పార్టీలో చేశారు.వీరికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ,కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, హనుమాన్ దేవస్థానం కమిటీ చైర్మన్ పెండ్యాల భాస్కర్,వార్డు సభ్యులు ఆరెపల్లి చిరంజీవి,రేణుక ఎల్లమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ పంజాల చటరీ, పెండ్యాల తిరుపతి (నవ్య చికెన్ సెంటర్),పంజాల ఉప్పలయ్య,పంజాల స్వామి,పంజాల కనకయ్య,పంజాల రమేష్,మాజీ వార్డు సభ్యులు పంజాల శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నాయకులు పంజాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular