
చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి
ఇటీవల ఘట్‌కేసర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పాపయ్యపేట గ్రామానికి చెందిన బుడిగే రవికుమార్, శిరీష దంపతుల కుమారులకు శనివారం 50 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ బుర్ర సుదర్శన్‌గౌడ్, బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మొర్రి కట్టయ్య ఈ సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింగాల సారంగం, వార్డు సభ్యులు వీరాస్వామి, మరాఠి కట్టయ్య, గుర్రం రవి, బండి రమేష్, దేవ్‌సింగ్, భూక్య రవీందర్, మండల వీరాస్వామి, లింగాల రామ్మూర్తి, కంచ కుమారస్వామి, మరాఠి మల్లయ్య, మేడి సుధాకర్, కన్నం సత్య, తదితరులు పాల్గొన్నారు.




