📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialరోడ్డు ప్రమాదంలో బైకిస్ట్ మృతి: ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు

రోడ్డు ప్రమాదంలో బైకిస్ట్ మృతి: ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

అతివేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్గటూర్ ఐసీ ఎస్సై రవీందర్ తెలిపారు. సుల్తానాబాద్ మండలం మడక గ్రామానికి చెందిన నూనె రాజు (45) బైక్‌పై వెల్గటూర్ నుండి ధర్మారం వెళ్తుండగా, ఎండపల్లి పెట్రోల్ బంక్ వద్ద అంబారిపేటకు చెందిన ఆరెల్లి ఈశ్వర్ తన ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి రాజు బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర రక్తగాయమై రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుమార్తె పెసరి శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.