📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గౌడ కులస్తుల జీవనాధారమైన తాటి, ఈత చెట్లు అగ్నికి ఆహుతి ఘటనాస్థలాన్ని పరిశీలించిన...

గౌడ కులస్తుల జీవనాధారమైన తాటి, ఈత చెట్లు అగ్నికి ఆహుతి ఘటనాస్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 8 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గౌడ కులస్తుల జీవనాధారమైన తాటి, ఈత చెట్లు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ బుధవారం ఘటనాస్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గౌడ కులస్తులకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular