📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriబాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 7: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో మాజీ కౌన్సిలర్ కడుపపొల్లా మల్లేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్‌కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. దళిత వర్గాల అభ్యున్నతి, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారత మాజీ రక్షణ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని కొనియాడరు .

ఈ కార్యక్రమంలో బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, కోరుబోతు నాగరాజు, మీసాల రాజేష్, మోత్కుపల్లి శ్రీనివాస్, తోక మల్లేష్, ఎంఎస్‌కే సాల్మన్ రాజు, కొండపూర్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular