ధర్మపురిలో గత నవంబర్‌లో ఏలేటి లక్ష్మణ్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఆదేశాలతో, సీఐ రాంనర్సింహారెడ్డి సూచనల మేరకు ఎస్సై మహేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలతో ఒడిశా వెళ్లి నిందితుడు రెహ్మాన్ బాక్స్ (30)ను అరెస్ట్ చేసింది. అతని వద్ద నుండి వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఒడిశాలో అంతర్రాష్ట్ర దొంగను ఛేదించి, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ప్రత్యేక పోలీస్ బృందం
0
10
- Advertisment -




