📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్ – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్ – అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

📰 Generate e-Paper Clip

తిరుమల.జూలై 03 ప్రజావాణి టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసుల విజయవంతమైన చర్య నలుగురు నిందితుల అరెస్ట్ –12 నకిలీ ఆధార్ కార్డులు,2 సెల్‌ఫోన్లు స్వాధీనం దళారులను ఆశ్రయించవద్దని శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి తిరుపతి జిల్లా  తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతూ,గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.02-07-2026న సి.ఆర్.ఓ.కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు.దర్యాప్తులో మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి టీటీడీ గదులను పొందడం,అనంతరం వాటిని రూ.2,000 నుంచి రూ.3,000 వరకు అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తూ వచ్చినట్లు వెల్లడైంది.వారి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.అరెస్టు చేసిన నిందితులు:1.ఎం.వేణుగోపాల్ (తెలంగాణ)2.దొంత రవీంద్రబాబు (ఆంధ్రప్రదేశ్)3.సంతోష్ కుమార్ (ఉత్తరప్రదేశ్)4.టి.ఈశ్వర్ (తెలంగాణ)- స్వాధీనం:2 ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు12 నకిలీ ఆధార్ కార్డులు డిజిటల్ ఆధారాలు ఈ ముఠా గత కొంతకాలంగా నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదులను అక్రమంగా పొందుతూ శ్రీవారి భక్తులను,టీటీడీని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.నిందితులను గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.ఈ అక్రమ దందాను ఛేదించిన తిరుమల II టౌన్ పోలీసులు,టీటీడీ విజిలెన్స్ అధికారులను తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు,ఐపీఎస్.మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్.అభినందించారు.శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి టీటీడీ వసతి గదులను అధికారిక కౌంటర్లు లేదా అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారానే పొందాలి.దళారులు లేదా మధ్యవర్తులను ఆశ్రయించరాదు. ఎవరైనా అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే తిరుమల పోలీసులు లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.భక్తులను మోసం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.