📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriజాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘన సత్కారం

జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 1: జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. కిరణ్ కుమార్, డాక్టర్ మేకల శ్రీనివాస్ రావు, డాక్టర్ ప్రసాద్‌లకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, సమాజానికి వారు చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, ప్రెసిడెంట్ రేసు లక్ష్మారెడ్డి, సెక్రటరీ బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, ట్రెజరర్ వేల్పుల రవికుమార్ యాదవ్, డాక్టర్ జంగయ్య, బోగ శ్రీలక్ష్మి హరినాథ్, ఉడుత హిమబిందు నవీన్, నాగిళ్ల నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.