📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఫారాల పంపిణీ

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఫారాల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 1: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు)కు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలకు కార్యక్రమం నిర్వహణపై అవసరమైన సూచనలు అందజేశారు.

కార్యక్రమంలో రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున శశికళ, బీజేపీ పార్టీ తరఫున వీరేశం హాజరై కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీఎల్‌ఓలు నిర్ణీత గడువులోగా ఇంటింటి సర్వే నిర్వహించి, అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి, ఫారాలను పూర్తిచేసి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.