📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

ఇటుకులపాడులో వెలగని వీధి దీపాలు – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!
ఇటుకులపాడు జూలై 1 ప్రజావాణి సాంకేతికతతో జగమంతా వెలిగిపోతుంటే.ఇటుకులపాడు గ్రామం మాత్రం ఇంకా అంధకారంలోనే కొట్టుమిట్టాడుతోంది.గ్రామంలోని పలు వీధుల్లో వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో నివాసితులు నరకయాతన అనుభవిస్తున్నారు.సూర్యుడు అస్తమించాడంటే చాలు.గ్రామ వీధులన్నీ అడవిని తలపిస్తున్నాయి.కనీసం నడవడానికి కూడా వీల్లేని ఘోరమైన చీకటి పరిస్థితులు నెలకొన్నాయి.అడుగడుగునా భయం.ఆందోళనలో విద్యార్థులు,వృద్ధులు ఈ అంధకారం కారణంగా రాత్రి వేళల్లో ట్యూషన్లకు,కళాశాలలకు వెళ్ళి వచ్చే విద్యార్థులు,అత్యవసర పనులపై బయటకు వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కంటిచూపు సరిగా లేని వృద్ధులు చీకట్లో నడవలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు.దీనికితోడు రోడ్లపై ఉన్న గుంతలు చీకట్లో కనిపించక నిత్యం ఎవరో ఒకరు కిందపడి గాయాలపాలవుతున్నారు.పాములు,విషపురుగుల సంచారం–ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని. గ్రామ వీధులు చీకటిగా మారడంతో పాములు,తేళ్ళు,ఇతర విషకీటకాల సంచారం విపరీతంగా పెరిగిపోయింది.రాత్రి పూట ఎటునుంచి ఏ విషసర్పం వచ్చి కాటు వేస్తుందోనని గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.వీధి దీపాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు,చోరీలు పెరిగే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తీవ్రమైన సమస్యపై గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ,సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం శూన్యంగా మారింది.”అధికారులకు వినతులు ఇవ్వడం మా వంతైంది.పట్టించుకోకపోవడం వారి వంతైంది”అంటూ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాత్కాలికంగా ఏదో ఒక లైట్ వేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప,సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానేసి,తక్షణమే స్పందించాలి.గ్రామంలో పనిచేయని వీధి దీపాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి.చీకటిగా ఉన్న ప్రతి వీధిలోనూ నూతన ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసి గ్రామానికి అంధకార విముక్తి కల్పించాలి.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.