ఘట్‌కేసర్, జూన్ 29: ఘట్‌కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ పరిధిలోని 304వ బూత్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కొనసాగుతోంది. బూత్ స్థాయి అధికారి బాబు ఆధ్వర్యంలో, బూత్ స్థాయి ప్రతినిధి రాజు సమక్షంలో మారం లక్ష్మారెడ్డికి ఎన్యుమరేషన్ ఫారాన్ని రేసు లక్ష్మారెడ్డి, సిరాజ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలోని వివరాలను ప్రతి ఓటరు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.




