📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyకిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ

కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ అప్లికేషన్ల పంపిణీ

అమీన్పూర్, జూన్ 29 (ప్రజావాణి): పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు దరఖాస్తుల పంపిణీ చేపట్టారు.అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఎల్ఓలు, బీఎల్ఏ-2లతో కలిసి వివిధ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎస్ఐఆర్ అప్లికేషన్లు అందజేశారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, సవరణలు ఉంటే దరఖాస్తుల ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటర్ జాబితాలో ప్రతి అర్హుడి వివరాలు సక్రమంగా నమోదై ఉండేలా ప్రజలు సహకరించాలని, పారదర్శకమైన ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈర్ల రాజు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఏ-2 సముద్రాల రాకేష్, బీఎల్ఏ-2 రాజ్‌కుమార్, బీఎల్ఓ జనార్ధన్, బీజేపీ నాయకుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular