సిద్దిపేట మర్కుక్, జూన్ 15, ప్రజావాణి
మార్కుక్ మండల వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్ పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాలలో రైతులు దుక్కి దున్ని విత్తనానికి సిద్ధం చేశారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి కంది తదితర పంటలు విత్తనాలు వేశారు. అయితే ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తొందరపడకండి విత్తనాలు తగినంత వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలు వేయాలని సూచించారు.




