📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి...పొన్నబోయిన శ్రీనివాస్, ముదిరాజ్ తెలంగాణ  హుస్నాబాద్ మండల అధ్యక్షులు..

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి…పొన్నబోయిన శ్రీనివాస్, ముదిరాజ్ తెలంగాణ  హుస్నాబాద్ మండల అధ్యక్షులు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, జూన్ 11, ప్రజావాణి

రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అంటూ ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు ఓట్లకోసం పొగుడుతూ ఎన్నికల్లో గెలిచినంక రైతులను మర్చిపోతున్నారు విత్తనాల కొనుగోలు నుండి మొదలుకొని పంట అమ్ముకునేదాక సవాలక్ష ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది రైతు జీవితం దుక్కి దున్నేకాన్నుంచి వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది కూలీల కొరత ,ఎరువుల కొరత చీడ పురుగుల దాడితో వడగండ్ల వర్షాలతో, తుఫాన్ లతో,విద్యుత్ కోతల తో, వన్య ప్రాణుల దాడితో,కరెంట్ షాక్ లతో,పాము కాటుకు,చివరకు గిట్టుబాటు ధరలేక, పండించిన పంటలు కొనేవారు లేక ఇలా అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాలు, పార్టీలు ఎందుకు ఎవరికోసం ఈ దేశం లో ప్రతి కంపెనీ తయారు చేసిన వస్తువును వారు నిర్ణయించిన రేటుకు అమ్ముకుంటుండు,కానీ ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం తను పండించిన పంటకు మాత్రం ధర నిర్ణయించే హక్కు లేదు అంటే మనదేశం ఎటు వైపు పయనిస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు ఇపుడున్న పరిస్థితుల్లో వ్యవసాయ సాగు ఎక్కువగా చేస్తున్న సందర్భంలో కూలీల కొరత ఏర్పడింది ఉపాధి హామీ పనుల్లో భాగంగా వ్యవసాయేతర పనులు చేస్తుండడంతో వ్యవసాయ పనులకు తీవ్ర కూలీల కొరత ఏర్పడింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేసి రైతులను ఆదుకోవాలి*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular