వైయస్సార్ కడప జిల్లా జూన్ 7 ప్రజావాణి బి కోడూరు మండలం మున్నెల్లి ఎస్సీ గ్రామంలో నివాసముండే మొలక రాజశేఖర్ తండ్రి యేసు రత్నం అనే మేము నిరుపేదలము. రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ నేను స్వీట్ వ్యాపారం చేస్తున్న శీలం నర్సిరెడ్డి వద్ద ఏజెంట్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నా భార్య మొలక అన్నపూర్ణ ఇంటిదగ్గర ఎనుమునులు మేపుకుంటూ జీవనం చేస్తూ సాగిస్తున్నాము.అయితే మాకు ఒకటి సొంత బర్రె. ఒక రైతు దగ్గర పాలికి తీసుకున్న బర్రెలు రెండు. మొత్తం మూడు బర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈ క్రమంలో నిన్నటి దినము ఉదయం 8 గంటలకు నా భార్య మూడు ఎనుములను మేపుకోవడానికి బర్రెలను వదిలింది. అయితే బర్రెలు ఇంటికి రాకపోవడంతో నా భార్య మా గ్రామ పరిసరాల ప్రాంతాల్లో వెతికినది. ఎక్కడ కూడా కనిపించలేదు. నేను నా భార్య బర్రెలను వెతుకుతుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కేశపురం గ్రామ పొలము కేశపురం గ్రామానికి చెందిన మాల సుదర్శన్ రెడ్డి పొలంలోమూడు బర్రెలు చనిపోయిన అని రామిరెడ్డి మాకు చెప్పగా నేను.మా చిన్నాన్న.పల్లయ్య.రవికుమార్ వెళ్లి చూడగా మూడు బర్రెలు చనిపోయి ఉన్నాయి. అంతట మేము బర్రెలు ఎలా చనిపోయాయి ఉంటాయని విచారించగా మాల సుదర్శన్ రెడ్డి తన పత్తి పొలం కు గుళికల మందు వేసి ఉన్నాడని.ఆ గుళికలతో కూడిన గడ్డి తినడం వలన చనిపోయాయని మాకు తెలిసింది.మేము వెంటనే ముడుమాలకు చెందిన పశు వైద్యాధికారి అయినా శివ కు తెలియజేయగా ఆయన పొలం వద్దకు వచ్చి ఒక బర్రెకు పోస్టుమాస్టర్ చేసి గులిగిలతో కూడిన (పాయిజన్ )తినడం వలన బర్రెలు చనిపోయిన అని చెప్పడం జరిగింది. మాకు ఉన్న మూడు ఎనుములు కూడా పూర్తి నెలలు నిండిన బర్రెలు ఒక్కొక్క బర్రె కనీసం లక్ష రూపాయలు పోతుంది.మూడు బర్రెలు కలిసి మూడు లక్షల రూపాయలు నష్టం కావడంతో మాకు ఏమీ అర్థం కావడం లేదు.ఎనుములనే నమ్ముకొని జీవిస్తున్న మాకు ఏమి చేయాలో తోచడం లేదని బాధితులు వాపోతున్నారు.మాల సుదర్శన్ రెడ్డి పొలంలోనే విష పూరితమైన గడ్డి తినడం వల్లనే బర్రెలు చనిపోయినాయని మాకు నష్టం కలిగించిన మాల సుదర్శన్ రెడ్డి పై తగు చర్యలు తీసుకోవాలని నాకు న్యాయం చేయాలని బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము అన్నారు.విషయం తెలుసుకున్న బ్రహ్మంగారిమఠం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.ఏది ఏమైనా గానీ నష్టం జరిగిన బాధితులకు న్యాయం చేయాలని నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు
మేతకపోయిన బర్రెలు గులికల మందు తిని మూడు ఎనుముల మృతి. మూడు లక్షల రూపాయలు నష్టం.
0
11
Previous article
RELATED ARTICLES
- Advertisment -




