📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం – ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ

వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం – ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూన్ 3 ప్రజావాణి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం  ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి పిలుపు బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి. పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టనున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ మేనిఫెస్టో మరియు సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.అనంతరం “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ప్రచార సామగ్రిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, దేవసాని ఆదిత్య రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8 లేదా 9న ఇండోర్ సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పలు ప్రజా ప్రతినిధులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.