📄 ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దొంగ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది, సమాజంలో మరోలా చలామణీ అవుతున్న ఉదంతంపై ఘాటుగా,

నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు.. ఎస్ఆర్ (SR)లో అసలు రంగు!

కడప జిల్లా జూన్ 3 ప్రజావాణి పోరుమామిళ్ల ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడే అర్హులైన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతూ.. కొందరు అక్రమార్కులు దొంగ సర్టిఫికెట్లతో కొలువులు కొల్లగొడుతున్నారు. డీఎస్సీ (DSC) దరఖాస్తు సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు (Fake Caste Certificates), నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లు (Fake PH Certificates) సమర్పించి ఉద్యోగాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగకుండా, ఉద్యోగంలో చేరిన తర్వాత తమ సేవా పుస్తకాల్లో (Service Rules – SR) సొంత కులాన్ని నమోదు చేయించుకుంటూ ప్రభుత్వ కళ్లుగప్పుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
రిజర్వేషన్ల దుర్వినియోగం.. అర్హులకు అన్యాయం
ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు, వికలాంగులకు కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్లను ఈ అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సాధించలేని కొందరు అభ్యర్థులు, తక్కువ కటాఫ్ మార్కులు ఉండే కులాల సర్టిఫికెట్లను లేదా నకిలీ సదరం (SADAREM) పత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా సులభంగా ఉద్యోగాలు సాధిస్తూ, నిజమైన లబ్ధిదారుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారు.
ఉద్యోగం వచ్చాక ‘సర్వీస్ రిజిస్టర్’లో మార్పులు!
నియామక ప్రక్రియ ముగిసి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత అసలు నాటకం మొదలవుతోంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు, భవిష్యత్తులో తమ పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇబ్బంది కలగకూడదనే స్వార్థంతో.. తమ సర్వీస్ రిజిస్టర్ (SR) లో సొంత కుల వివరాలను నమోదు చేయించుకుంటున్నారు. దీని కోసం అధికారుల అండదండలతో లేదా నిబంధనల్లోని లొసుగులను వాడుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా ఈ మార్పులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రజలు మరియు నిరుద్యోగుల ఆగ్రహం
ఈ వ్యవహారంపై నిరుద్యోగ సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లోపించడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. దరఖాస్తు సమయం నాటి సర్టిఫికెట్లకు, ప్రస్తుతం ఎస్ఆర్ (SR) లో ఉన్న వివరాలకు తేడాలు ఎందుకు వస్తున్నాయో ఉన్నతాధికారులు సమీక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు.తక్షణమే విచారణ జరపాలి,సమాజానికి నీతి,నిజాయితీలను నేర్పించాల్సిన గురువులే దారి తప్పారు.అక్షరాలు నేర్పే‘పూజ్యులు’అడ్డదారుల్లో ఉద్యోగాలు పొంది విద్యావ్యవస్థకే మచ్చ తెస్తున్నారు.గతంలో తప్పుడు (ఫేక్) కుల ధ్రువీకరణ పత్రాలను సృష్టించి,ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ల కోటాలో టీచర్ ఉద్యోగాలు కొట్టేసిన కొందరు ఘనాపాఠీల గుట్టు ఇప్పుడు రచ్చకెక్కుతోంది.కాగితాల్లో ఒక కులం. బయట మాత్రం తాము‘రెడ్డి’బలిజ’ అంటూ తిరుగుతున్న వీరి ద్వంద్వ అవతారాలు విద్యాశాఖలో కలకలం రేపుతున్నాయి.కాగితాలపై ‘రిజర్వేషన్’కాలర్‌ ఎగరేసేందుకు‘ఓసీ’ఉద్యోగం సాధించడానికి ప్రభుత్వ ఫలాలను అనుభవించడానికి వీరికి ఎస్సీ,ఎస్టీ సర్టిఫికెట్లు కావాలి.కానీ,సమాజంలో మాత్రం తాము అగ్రకులానికి చెందిన ‘రెడ్డి’లమని లేదా ఆర్థికంగా,రాజకీయంగా బలమైన‘బలిజ’లమని చెప్పుకుంటూ కాలర్ ఎగరేస్తున్నారు.సర్వీస్ రిజిస్టర్లలో (SR),క్యాస్ట్ సర్టిఫికెట్లలో దళితులని,గిరిజనులని రాసి ఉన్నప్పటికీ,వాస్తవ జీవితంలో మాత్రం ఆయా కులాలను కించపరిచేలా,తాము ఉన్నత కులస్థులమనే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.ఈ నాలుక ధోరణి వీరి మోసపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోంది. అర్హుల నోళ్లు కొట్టి.కోట్లాది రూపాయల జీతాలు మింగేస్తూ.నిజమైన ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు పేదరికంతో పోరాడుతూ,పగలు రాత్రి కష్టపడి చదివినా ఉద్యోగాలు దక్కక వీధులపాలవుతున్నారు.కానీ,ఇలాంటి మోసగాళ్లు నకిలీ పత్రాలతో ఆ రిజర్వేషన్లను దొంగిలించి,దశాబ్దాలుగా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయల జీతాలను,ఇతర ప్రయోజనాలను అక్రమంగా అనుభవిస్తున్నారు.ఇది కేవలం ఒక సర్టిఫికెట్ ఫోర్జరీ మాత్రమే కాదు,ఒక నిరుపేద దళిత గిరిజన అభ్యర్థి జీవితాన్ని,వారి కుటుంబ భవిష్యత్తును నిలువునా ఖననం చేయడమే.విద్యాశాఖ నిద్ర వీడేది ఎప్పుడు?ఇలాంటి ‘ఉపాధ్యాయ ముసుగులోని మోసగాళ్ల’పై గతంలోనే అనేక ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తనిఖీలు నిశితంగా జరిపితే వీరి అసలు రంగు బయటపడుతుందని, ఐడెంటిటీ కార్డులు,సామాజిక విచారణ (Social Status Verification) చేపడితే సగానికి పైగా దొంగ బాబాల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమని బాధితులు డిమాండ్ చేస్తున్నారు

క్రిమినల్ కేసులు పెట్టి.రికవరీ చేయాలి!ఇలాంటి వారిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు. వీరిపై తక్షణమే ఐపీసీ సెక్షన్ల కింద చీటింగ్,ఫోర్జరీ కేసులు నమోదు చేయాలి.ఇప్పటివరకు వీరు ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో ఎంతైతే డ్రా చేశారో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలి.సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయ వృత్తికే కలుపు మొక్కల్లా మారిన వీరిని కఠినంగా శిక్షిస్తేనే.భవిష్యత్తులో ఇలాంటి మోసాలకు పాల్పడటానికి ఎవరూ సాహసించరు.@@దొంగ కుల ధ్రువీకరణ పత్రాలతో టీచర్ ఉద్యోగాలు పొందిన ఘనాపాఠీల వెనుక అసలు సూత్రధారులు బయటపడ్డారు.సమాజానికి నీతి నేర్పాల్సిన గురువులు నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు కొట్టేస్తే,వారికి జిల్లా విద్యాశాఖ అధికారులే (DEO కార్యాలయ సిబ్బంది) అండగా నిలిచారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.లంచాల వెల్లువలో మునిగితేలుతూ,నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు జిల్లా అధికారులు.ఈ భారీ కుంభకోణానికి బాధ్యులని స్పష్టమవుతోంది.కాగితాల్లో ఎస్సీ,ఎస్టీలుగా ఉంటూ,బయట‘రెడ్డి’బలిజ’లుగా చలామణీ అవుతున్న టీచర్ల వెనుక ఉన్న అధికారుల నెట్‌వర్క్‌పై ‘ప్రత్యేక
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ‘మామూళ్ల’ పర్వం
ఉద్యోగ నియామక సమయంలోనూ,ఆ తర్వాత సర్వీస్ రిజిస్టర్ (SR) నమోదు చేసేటప్పుడు ప్రతి సర్టిఫికెట్‌ను నిశితంగా పరిశీలించాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులపై ఉంటుంది. కానీ,సదరు ఉపాధ్యాయులు సమర్పించిన నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు కళ్లు మూసుకుని ఆమోదించారు. దీని వెనుక లక్షలాది రూపాయల చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది. తనిఖీ చేయాల్సిన అధికారులే ‘మామూళ్ల’మత్తులో జోగడం వల్లే.ఈ దొంగ ఉపాధ్యాయులు దశాబ్దాలుగా విద్యావ్యవస్థలో కొనసాగుతున్నారు.
ఫిర్యాదులు వచ్చినా తొక్కిపెట్టిన ‘పెద్దలు
ఈ నకిలీల వ్యవహారంపై గతంలో పలుమార్లు బాధితులు,సంఘాల నాయకులు ఆధారాలతో సహా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు.అయినా సరే,సదరు అధికారులు ఆ ఫైళ్లను అల్మారాల్లో పెట్టి తొక్కిపెట్టారు.అంతర్గత విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, నిందితులకు సమాచారం అందిస్తూ వారిని కాపాడుతూ వచ్చారు.ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం,లేదా కేసులను నీరుగార్చడం వెనుక జిల్లా స్థాయి అధికారుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.
కంచె చేను మేస్తే. న్యాయం ఎక్కడ?
నిజమైన ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు తమ హక్కుల కోసం,ఉద్యోగాల కోసం కోర్టుల చుట్టూ,కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.రక్షించాల్సిన విద్యాశాఖ అధికారులే భక్షకులుగా మారారు.నకిలీ సర్టిఫికెట్లను ప్రోత్సహించడం ద్వారా ఈ అధికారులు కేవలం అవినీతికి పాల్పడడమే కాకుండా,రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఆశయానికే గొడ్డలిపెట్టుగా మారారు. ఉపాధ్యాయులతో పాటు ఈ అవినీతి అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉన్నతాధికారుల సమగ్ర విచారణే శరణ్యం!
ఈ జిల్లా స్థాయి కుంభకోణంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.గత కొన్ని ఏళ్లుగా జిల్లా కార్యాలయంలో పని చేసిన అధికారులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కమిటీ సభ్యుల లావాదేవీలపై నిఘా పెట్టాలి. మోసపూరిత టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు,వారికి సహకరించిన ప్రతి ఒక్క జిల్లా అధికారిని సర్వీస్ నుంచి సస్పెండ్ చేసి జైలుకు పంపినప్పుడే విద్యావ్యవస్థ ప్రక్షాళన అవుతుంది.రేపటి సంచికలో గవర్నమెంట్ టీచర్ల పేర్లతో సహా మీ ప్రజావాణిలో

RELATED ARTICLES
- Advertisment -

Most Popular