📄 ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

*షాద్‌నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘన నివాళులు*

*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం*

షాద్‌నగర్ ప్రజావాణి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్‌నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండల కార్యాలయం ఎదుట ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తొలి దశ, మలిదశ ఉద్యమకారులు, అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగాలు, అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ తాలూకా జేఏసీ చైర్మన్ ఎం. జనార్ధన్, టి.జి. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కన్వీనర్ నక్క బాల్‌రాజ్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ పంది వెంకట్రామిరెడ్డి, ఆర్టీసీ అర్జున్ కుమార్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, బాదేపల్లి సిద్ధార్థ, కౌన్సిలర్ రాజు నాయక్, క్యూసెట్ శ్రీనివాస్, రోమియో రమేష్ తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular