అప్పు విషయంలో యువకుడిపై దాడి అవమానంతో ఉరివేసుకుని ఆత్మహత్య
*తంగళ్ళపల్లి ప్రజావాణి జూన్ 02* అప్పు తీసుకున్న డబ్బుల విషయంలో జరిగిన గొడవ, దాడి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. ఓబులాపూర్ గ్రామానికి చెందిన కొత్తకొండ బాలకిషన్ (26) గతంలో అదే గ్రామానికి చెందిన దోమల కొమురయ్య వద్ద 3,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం దోమల హరీష్, దోమల వంశీ అనే వ్యక్తులు ఆ డబ్బుల గురించి బాలకిషన్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తీవ్రస్థాయికి చేరుకోవడంతో వారు బాలకిషన్‌ను బూతులు తిట్టడమే కాకుండా, కర్రతో చితకబాదారు. గ్రామస్తుల సమక్షంలో జరిగిన ఈ దాడితో తీవ్ర అవమానానికి గురైన బాలకిషన్ మనస్తాపం చెందాడు. నేరుగా తన ఇంటికి వెళ్ళిన యువకుడు, ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి కొత్తకొండ బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టమని ఎస్ ఐ.తెలిపారు
అప్పు విషయంలో యువకుడిపై దాడి అవమానంతో ఉరివేసుకుని ఆత్మహత్య
RELATED ARTICLES



