📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం---- టిప్పర్ స్వాధీనం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం—- టిప్పర్ స్వాధీనం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 31(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవక్కపల్లి బస్ స్టేజ్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నట్లు బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి తెలిపారు.రేణికుంట గ్రామ పరిధిలోని మొయ్యతుమ్మెద వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో సిద్ధిపేట జిల్లాకు చెందిన హరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, టిప్పర్‌తో పాటు ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular