📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetభక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ

భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 29(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఏకాశీల గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి గుట్ట చుట్టూ భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అశేష భక్తుల సమక్షంలో భజన కీర్తనలు, నరసింహస్వామి నామస్మరణలతో తెల్లవారు జామున నుండి ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.భక్తులు ఎంతో ఉత్సాహభరితంగా, భక్తి భావంతో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులు “జై నరసింహ” నినాదాలతో స్వామివారిని స్మరించగా, భజన బృందాల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల రద్దీతో ఏకాశీల గుట్ట పరిసరాలు సందడిగా మారాయి.ఈ కార్యక్రమంలో మహిళలు,ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గిరి ప్రదర్శనని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular