📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipet"నేర నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం " ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు...

“నేర నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం ” ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి — ఎస్సై తోట తిరుపతి

📰 Generate e-Paper Clip

నేర నియంత్రణలో సిసి కెమెరాల

బెజ్జంకి, మే 24(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై తోట తిరుపతి సూచించారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, నిర్వహణపై ఆయన ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని,నేరాల నియంత్రణతో పాటు,నేర నిరూపణలో కూడా సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. గ్రామాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రజల సహకారం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు కొంకటి సురేష్, గ్రామస్తులు గుగ్గిళ్ల రాజేష్, దుగ్యాని మోహన్ పాల్గొన్నారు.అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన బెజ్జంకి ఎస్సై తోట తిరుపతిని శాలువాతో సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.