📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేముల మహేశ్ గౌడ్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేముల మహేశ్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఘాట్ కేసర్, మే 24 : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఆదివారం మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిసరి మహిపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటీక్యాల కృష్ణ రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular