📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyకామారెడ్డిలో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

కామారెడ్డిలో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

📰 Generate e-Paper Clip

కామారెడ్డిలో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

ప్రజావాణి
మే 22
కామారెడ్డి జిల్లా ప్రతినిధి


కామారెడ్డి పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నిజాంసాగర్ చౌరస్తా నుండి  రోడ్డులో
కావేరి హోటల్ 
బజాజ్ ఎలక్ట్రానిక్స్
మెడికేర్ హాస్పిటల్ 
వాహనదారుల ఇష్టారాజ్య పార్కింగ్‌తో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కావేరి హోటల్‌ నుంచి మెడికేర్ హాస్పిటల్‌ వరకు రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు పక్కన కాకుండా నేరుగా ప్రధాన రహదారిపైనే బైకులు, కార్లు పార్క్‌ చేయడంతో ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. రద్దీ సమయాల్లో అంబులెన్సులు, స్కూల్‌ బస్సులు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వాహనాలు పార్క్ చేస్తున్న వారిపై పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే “నో పార్కింగ్” బోర్డులు ఏర్పాటు చేసి, అక్రమ పార్కింగ్‌పై జరిమానాలు విధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular