📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriకాచువాని సింగారంలో ఘనంగా శ్రీ తుల్జా భవాని – రేణుక ఎల్లమ్మ కళ్యాణ 4వ మహోత్సవం

కాచువాని సింగారంలో ఘనంగా శ్రీ తుల్జా భవాని – రేణుక ఎల్లమ్మ కళ్యాణ 4వ మహోత్సవం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ కాచువాని సింగారంలో శ్రీ తుల్జా భవాని, శ్రీ రేణుక ఎల్లమ్మ, జమదగ్ని మహర్షుల 4వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం బుర్ర లక్ష్మణస్వామి అమ్మవారి ఉపాసకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.

ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మేడ్చల్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉపాసకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రే రాజేష్, ఘట్కేసర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్, బుర్ర మల్లేష్ గౌడ్, బుర్ర శివ సంపత్ గౌడ్ (డిన్ను), బుర్ర యశ్వంత్ గౌడ్ (లిట్టు), లక్ష్మణస్వామి కుటుంబ సభ్యులు, భక్తులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular