ప్రజావాణి, మోతే మే 17:మోతే మనడలం మామిళ్ళగూడెం గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో 2003-2004 విద్యాసంవత్సరం లో 10వ తరగతి చదువు కున్న విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత వారికి విద్యబుద్దులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయుల తో సమ్మేళనం అయ్యారు.ఈ కార్యక్రమం లో వారి గురువులను ఘనంగా సన్మానించారు. వివిధ వృత్తులలో స్థిరపడ్డ ప్రతి ఒక్కరు వారి యోగ క్షేమలు తెలుపుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సంతోష కరమైన వాతావరణం లో ఈ రోజును గడిపినారు. ఇట్టి కార్యక్రమం లో ఆనాటి ఉపాధ్యాయులు వెంకటయ్యసార్ , రామకృష్ణసార్ , అశోక్ సార్, తిరుమల మేడమ్, విద్యార్థులు సతీష్ రెడ్డి, క్రాంతి కుమార్, లింగయ్య, లింగరాజు, జ్యోష్న, సావిత్ర, ఉపేంద్ర, లింగరాజు, నాగరాజు,కృష్ణ రెడ్డి, తిరుపతి,సైదులు తదితరులు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసినారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం……. 22 సంత్సరాల తర్వాత మళ్ళీ ఒక్కటైనా బాల్య మిత్రులు…..
0
26


