ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): ఆర్‌ఎల్ నగర్‌లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆర్‌ఎల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నవితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు బెలిది రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్ గుప్తా హాజరై అన్నదాన సేవలో పాల్గొన్నారు. సమాజ సేవలో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎల్ నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జూలకంటి రమేష్, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి రాజశేఖర్, కోశాధికారి నేతి సంతోష్ కుమార్, సముద్రాల విశ్వనాథం, జూలకంటి అశోక్, నీలా శివకుమార్, చంద్రశేఖర్, వల్లాల మల్లయ్య, సంతోష్ తదితర ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.



