జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ తీరే సప “రేటు”
ఏజెంట్లు దళారులు ద్వారా అక్రమ వసూళ్లు..?
వృద్ధులు అయినా కనికరము ఉండదు..?
పేపర్ చిట్టి నగదు ముట్ట చెపితే పని పూర్తి
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పట్టించుకోని పాలకులు, నిఘా యంత్రాంగాలు
మన ప్రజావాణి (నెట్వర్కింగ్ విభాగం)
ఆ సబ రిజిస్టర్ కార్యాలయంలో పనిని బట్టి రేటు ఉంటుంది.. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఏజెంట్లు మధ్యవర్తులు (దళారులు) ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడు తూ అందిన కాడికి గుంజుతున్నప్పటికీ ఇటు పాలకులు గానీ అటు నిఘా సంస్థలు గానీ పట్టించుకోకపోవడం విశేషం. మన ప్రజావాణి ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డగా మారిందని స్థానికులతో పాటు జిల్లా ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఏజెంట్లు దళారులు ద్వారా ఓ చిన్న చిట్టి పై రాసి సంబంధిత పత్రాలతో పాటు నగదును ఏజెంట్లు కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి బహిరంగంగా అందిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ విలువను బట్టి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022 సంవత్సరంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న జంగారెడ్డిగూడెం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంకు వచ్చే వారి వద్ద నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ చివరికి వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా వదిలిపెట్టకుండా అక్రమ వసూళ్లు చేసినట్లు ఆధారాలతో సహా మన ప్రజావాణి సేకరించింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు నిఘా యంత్రాంగాలు జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగే అక్రమ వసూళ్లపై నిఘా ఉంచి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అక్రమ దందా కొనసాగిస్తున్న కార్యాలయ సిబ్బందిపై ఏజెంట్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులతో పాటు జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరికొన్ని సమగ్ర ఆధారాలతో.. అధికారుల వివరణలతో రేపటి కథనం..2లో వేచి చూడండి…!






