📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetజనాభా గణన 2027 మొదటి పేజ్ ఇండ్ల జాబితా,ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభం

జనాభా గణన 2027 మొదటి పేజ్ ఇండ్ల జాబితా,ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభం

📰 Generate e-Paper Clip

జనాభా గణన 2027 మొదటి పేజ్ ఇండ్ల జాబితా,ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభం

*చిలుకూరు మే11(ప్రజావాణి*): చిలుకూరు మండలంలో జనాభా గణన 2027లో భాగంగా మొదటి పేజ్ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యక్రమం,హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ తయారీలో భాగంగా ఈరోజు చిలుకూరు మండలము బేతవోలు గ్రామంలో గల 14 బ్లాక్ లను సందర్శించి  హెచ్. ఎల్. బి లోని ఇళ్ల జాబితా వివరములను సూపర్వైజర్లు చందా శ్రీనివాసరావు ,సాదే కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లు  అందరూ  సేకరించడం జరిగినది. దీని ఆధారంగా మూడు రోజుల్లో లేఅవుట్ మ్యాప్ క్రియేషన్ ను కంప్లీట్ చేయడం జరుగుతుంది .ఆ తర్వాత హెచ్ ఎల్ ఓ యాప్ లో కుటుంబం యొక్క డాటా సేకరణ జరుగుతుంది.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డిప్యూటీ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ బిక్కం  కోటేశ్వరరావు పాల్గొని తమ సూచనలు సలహాలు అందజేయడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular