📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సి.యం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

సి.యం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మే09) ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్న దృష్ట్యా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ ఎ.భార్గవ తేజ,పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం,ప్రజలు వచ్చే మార్గం వాటి పరిస్థితులు పరిశీలించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కే శ్రీనివాసరావు,డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి,జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular