📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకి ఎస్సై గా నూతన బాధ్యతలు చేపట్టిన తోట తిరుపతి

బెజ్జంకి ఎస్సై గా నూతన బాధ్యతలు చేపట్టిన తోట తిరుపతి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్‌హెచ్‌ఓగా తోట తిరుపతి బాధ్యతల స్వీకారం

బెజ్జంకి, మే 3 (ప్రజావాణి)

బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్‌హెచ్‌ఓగా తోట తిరుపతి ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని,
నేరాల నివారణ, ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తానని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తానని వెల్లడించారు.
అలాగే, పోలీస్ శాఖకు ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పోలీసులకు తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular