📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కాలేజీల మీద కథనాలు రాస్తే విలేకరిపై దాడి

కాలేజీల మీద కథనాలు రాస్తే విలేకరిపై దాడి

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 03)  అనంతపురం జిల్లా జర్నలిస్టు మిత్రులందరికీ విజ్ఞప్తి మిత్రులారా మనం దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ అనంతపురంలోని శ్రీ గీతం జూనియర్ కళాశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాల ఫై గత రెండు రోజులుగా వార్తా కథనాలు వ్రాశాడు.దీనిని జీర్ణించుకోలేని యాజమాన్యం వారి గుండాలతో శనివారం అనంతపురంలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేసి కాళ్లు మొక్కించుకోవడం జరిగింది.ఈ దాడిని నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా, మనం పేపర్ బ్యూరో బి.రవిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. వార్తా కథనం తప్పు అని మీరు భావిస్తే వ్రాసిన రిపోర్టర్ పైన, పేపర్ పైన మీరు లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు. అలాకాకుండా మీరు ఇంటికి వెళ్లి కుటుంబాన్ని విచ్చలవిడిగా కొట్టి భయభ్రాంతులకు గురి చేయడం. ముమ్మాటికి నేరం.ఒక దళిత విలేఖరిని చేతగాని వాడని ఇలా హింసించి కొట్టడం చాలా బాధాకరం. దీనిపై జర్నలిస్టు సోదరులు, జర్నలిస్టు సంఘాలు స్పందించి విలేకరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేందుకు అందరూ కలిసి రావాలని ఈ విషయంపై చర్చించేందుకు అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో ఐదు గంటలకు అందరూ సమావేశం కావలసిందిగా కోరుతున్నాను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.