📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyనడక కష్టం లేకుండా చేసి… చదువుల తల్లికి ‘సైకిల్’ తో తోడైన సుప్ప ప్రకాష్ అన్న!"*

నడక కష్టం లేకుండా చేసి… చదువుల తల్లికి ‘సైకిల్’ తో తోడైన సుప్ప ప్రకాష్ అన్న!”*

📰 Generate e-Paper Clip

*”నడక కష్టం లేకుండా చేసి… చదువుల తల్లికి ‘సైకిల్’ తో తోడైన సుప్ప ప్రకాష్ అన్న!”*

 

గౌతపూర్ గ్రామానికి చెందిన యాదయ్య కుమార్తె ప్రతిరోజూ 4 కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువుపై ఉన్న తపనతో, ఎండనైనా లెక్క చేయకుండా ఆమె చేస్తున్న ఈ కష్టాన్ని చూసి తండ్రి మనసు తల్లడిల్లింది.

ఈ విషయం తెలుసుకున్న బీసీ సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సుప్ప ప్రకాష్ గారు వెంటనే స్పందించారు. చిన్నారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదని భావించి, స్వయంగా ఒక సైకిల్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మనం చేసే చిన్న సహాయం… ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు” అని పేర్కొన్నారు.

సైకిల్ అందుకున్న చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందం, తండ్రి యాదయ్య కళ్లలో మెరిసిన కృతజ్ఞత అందరినీ కదిలించింది.

పేద విద్యార్థుల విద్యకు అండగా నిలుస్తూ, వారి కలలకు రెక్కలు తొడుగుతున్న సుప్ప ప్రకాష్ గారికి గౌతపూర్ గ్రామ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆవులమంద రమేష్, యూత్ వింగ్ అధ్యక్షులు బర్రె శేఖర్, మండల యూత్ వింగ్ నాయకులు మధు, రాజు, గ్రామ డిప్యూటీ సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు రాజు, ప్రదీప్, రామకృష్ణ, నరేష్, శ్రీనివాస్, లింగం తదితరులు పాల్గొన్నారు..

Previous article
*10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మన్మర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు* *మన్మర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరచి గ్రామానికి గర్వకారణమయ్యారు* .*ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులను సాధించిన విద్యార్థినులు ప్రత్యేకంగా నిలిచారు* *విద్యార్థుల విజయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.హెచ్.ఎం బస్సప్ప సర్ గారి కృషి విశేషంగా నిలిచింది* ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపడం వల్ల పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్థులు జి.హెచ్.ఎం బస్సప్ప సర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రతిభ చూపిన విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.