📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శక్తి యాప్తో తప్పిన ప్రమాదం. * ఆటోలో ప్రయాణిస్తున్న యువతీని వేదించినా ఆటో డ్రైవర్ అరెస్ట్.

శక్తి యాప్తో తప్పిన ప్రమాదం. * ఆటోలో ప్రయాణిస్తున్న యువతీని వేదించినా ఆటో డ్రైవర్ అరెస్ట్.

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పదే పదే తన కోరిక తీర్చాలని చేతులతో తడవడం,తన ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగటం.చివరికి మహిళ ఏడుస్తాఉంటే నీ ఏడుపు అందంగా ఉందని అనటం,నువ్వు చాలా బాగున్నావ్ అనటం,తన మాట విని తన కోరిక తీరుస్తే బాగా చూసుకుంటానని అసభ్యకరంగా మాట్లాడటం,తర్వాత బలవంతంగా బెదిరించి చేతులతో కొట్టి ఆమె లో ఉన్న డబ్బులు లాక్కున్నాడు.శక్తి యాప్ అలర్ట్ క్షణాల్లో చేరుకున్న పోలీసులు.కేసు వివరాలు:-Cr.No 170/2026 U/s 308(5),75,79,115(2),351(2) BNS ఆఫ్ మంగళగిరి గ్రామీణ పి.ఎస్.అరెస్టు కాబడిన నిందితుని వివరాలు:బొమ్మనపల్లి.ఫణీంద్ర కుమార్ఫ ణి, S/o లక్ష్మీపతి,వయస్సు 28 సంవత్సరములు,పాలుకొండ గ్రామం,నందివాడ మండలము,కృష్ణాజిల్లా.మహానాడు 11 -12 రోడ్డులో,తాడేపల్లి గ్రామం.కేసు విచారణ,పిర్యాది బీటెక్ ECE నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అని, బెంగళూరులో అల్జీ హోమ్స్ సమీపంలో గల టాటా ఎలక్ట్రానిక్స్ నందు internship ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తూ ఉండగా, బాపట్లలో తన చదివే కాలేజీలో NPTL ఫైనల్ ఎగ్జామ్ పరీక్ష కోసం ది.23.04.2026 తేదీన ఆమె బెంగళూరులో ఉదయం 7:30 గంటలకు బస్సు ఎక్కి మధ్యాహ్నం 1:30 గంటలకు కుప్పంకు చేరుకుని, అక్కడ నుండి శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించి రాత్రి షుమారు 1:00 గంటలకు విజయవాడకు రైల్వే స్టేషన్ కు చేరుకుని, అనంతరం ఆమె ఇంటికి వెళ్లేందుకు విజయవాడ ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని, ఆమె తండ్రికి కాల్ చెయ్యగా,ఆమె తండ్రి బెజవాడలోని ప్రైవేటు సంస్థ నందు సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ, షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వలన, అనారోగ్య కారణంగా రాలేకపోవడంతో, కాజా టోల్ గేట్ వరకు జాగ్రత్తగా రావాలని సూచించినట్లు, అంతట ఆమె విజయవాడ బస్టాండ్ వద్ద, AP39WE 8922 నంబర్ గల ఆటో డ్రైవర్ అయిన బొమ్మనపల్లి.ఫణీంద్ర ఆమెను పదేపదే సంప్రదించి, పరిస్థితుల వల్ల మరియు భయంతో ఆమె ఆ ఆటోలో ఎక్కినట్లు, ప్రయాణ సమయంలో నుండి జాతీయ రహదారి రోడ్డు ఎక్కే లోపు తన మొబైలులో శక్తి app డౌన్లోడ్ చేసుకున్నట్లు, ఆ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను పదేపదే తాకుతూ, దుర్భాషలాడుతూ, చెడు ఉద్దేశంతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, అలాగే ఆమెను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించి బెదిరించినట్లు. “శక్తి యాప్” ద్వారా పోలీసులకు సమాచారం అందించినట్లు, NRI ఫ్లైఓవర్ సమీపంలో ఆటో చేరుకున్నప్పుడు, నిందితుడు దారి మళ్లించి,ఆమె ఎడమ చెంపపై కొట్టి దాడి చేసి, చంపుతానని బెదిరిస్తూ భయపెట్టి, ఆమె పర్సులోని రూ.2020/- నగదును బలవంతంగా లాక్కునగా, అనంతరం ఆమె “శక్తి యాప్” ద్వారా పోలీసులకు ఇచ్చిన సంచారంతో మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల.వెంకట్, రైటర్ రామలింగేశ్వర రావు, HC అంకమ రావు,రోడ్డు సేఫ్టీ వెహికల్ సిబ్బందితో వెంటనే స్పందించి, నిందితుడు ఫణీంద్ర ఆటోను కాజా టోల్ గేట్ సమీపంలో అడ్డగించగా,పోలీసులను చూసి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించి, ఆటోను హైవేపై వదిలి సమీపంలోని పొలాల్లోకి పారిపోయాడు.పోలీసులు ఆటోలో ఉన్న యువతిని యువతిని రక్షించి, ఆమెను సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చినారు.ది 24.04.2026 తేదీన రాత్రి 7.30 గంటలకు నిందితుడిని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ గారు కాజ గ్రామములోని రామకృష్ణ వేనుజియా వద్ద రాబడిన సమాచారం మేరకు గుంటూర్ చానెల్ కలువ కట్ట వద్ద నిందితుడిని అరెస్ట్ చేయడమైనది. మహిళా జర్నీ విధానము:బెంగళూరు నుండి సుమారు ఉదయం ఏడు గంటలకు 7:30 గంటలకు బయలుదేరి,సుమారు 10.30 గంటల సమయంలో కుప్పం గ్రామం చేరి,అక్కడ నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ రైల్వేస్టేషన్లో మధ్యాహ్నం 1:30 గంటలకు శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కి సుమారు రాత్రి అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ చేరింది.మహిళ యొక్క పూర్తి జర్నీ సమయం షుమారు పదకొండు గంటలు.అందరూ మహిళలు తమ మొబైలు ఫోన్లో “శక్తి యాప్”డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కొరటమైనది.. అత్యవసర పరిస్థితుల్లో “శక్తి యాప్” వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఈ ఘటన స్పష్టంచేసిందని గ్రహించాలి.వాట్సాప్ లైవ్ లొకేషన్ పంపినడల అది సుమారు ఎనిమిది గంటలకు వరకు అప్డేట్ గా ఉంటుంది మహిళలు నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తమ సమాచారాన్ని కచ్చితంగా పోలీసులకు తెలియజేయాలి.రాత్రిపూట తిరిగి ఆటో డ్రైవర్లు తమ యొక్క సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలి.. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వారిపై సెక్షన్ 128 BNSS కింద కేసు నమోదు చేయబడుతుంది.కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బంది వివరాలు మంగళగిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ A.V. బ్రహ్మం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ SI శ్రీ వెంకటేశ్వర్లు.మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ HC రామలింగేశ్వర రావు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ HC అంకమ రావు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ HC శ్యామ్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ HG వీరయ్య

RELATED ARTICLES
- Advertisment -

Most Popular