📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కాజా చెరువు వాకింగ్ ట్రాక్ ,పార్కు, నిడమర్రు ట్రాక్ అభివృద్ధి,పనులను పరిశీలించిన,,గరపాలక సంస్థ కమిషనర్ అలీమ్...

కాజా చెరువు వాకింగ్ ట్రాక్ ,పార్కు, నిడమర్రు ట్రాక్ అభివృద్ధి,పనులను పరిశీలించిన,,గరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాషా.

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) మంగళగిరి తాడేపల్లి  నగర పాలక సంస్థ అభివుద్ది దిశగా  కాజా చెరువు వాకింగ్ ట్రాక్,పార్కు,నిడమర్రు ట్రాక్ అభివృద్ధి,పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు,నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాషా.పర్యావరణ పరిరక్షణ ప్రదమ లక్ష్యంగా నగర పాలక సంస్థ అడుగులు చెరువుల పునరుద్ధరణ తో నగర సుందరీకరణ–నిడమర్రు వాకింగ్ ట్రాక్ పనులు వేగవంతం నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ అభివుద్ది దిశగా  వెళుతున్న నేపద్యం లో ₹2 కోట్ల అంచనాతో జరుగుతున్న కాజా వాకింగ్ ట్రాక్,పార్కుల అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీనివాసులు,నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాషా.సంయుక్తంగా పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ,నీటి నిల్వ సామర్థ్య పెంపు వంటి అంశాలపై జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.అనంతరం సుమారు ₹2 కోట్లు 30 లక్షల వ్యయంతో చేపట్టిన నిడమర్రు చెరువు వాకింగ్ ట్రాక్ మరియు బండ్ నిర్మాణ పనులను వారు తనిఖీ చేశారు.ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో నడక సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ,నిర్ణీత గడువులో పూర్తి చేయాలనీ తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ఐటీ& విద్యా శాఖా మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి సూచనల మేరకు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ అభివృద్ధి దిశగా వెళుతున్న నేపథ్యంలో నగరంలోని పార్కులను త్వరితగతిన పూర్తి చేయాలని బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలనిఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారులకు పనులను అత్యుత్తమ నాణ్యతతో,నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.తద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అభివృద్ధి పనుల్లో పారదర్శకత,నాణ్యత మరియు వేగం పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో నగర పాలక సంస్థ డీఈఈ రమేష్ బాబు,ఎ ఈ ప్రసన్న,అర్బన్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్అధికారులు, ఉద్యాన అధికారి రామారావు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular