కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని ఆయన స్వగృహంలో ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, క్రమశిక్షణ, అంకితభావం మరియు నిరంతర శ్రమకు ప్రతీకగా నిలిచే నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి
RELATED ARTICLES




